VIDEO: సిరిమానుకు పూజలు చేసిన మాజీ జడ్పీటీసీ

SKLM: నరసన్నపేట మండలం మాకీవలస గ్రామంలో నిర్వహిస్తున్న సిరిమానోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక కాంచీపేట నుంచి తీసుకుని వస్తున్న సిరిమానుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే సతీమణి, మాజీ జడ్పీటీసీ బగ్గు సుగుణమ్మ, మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి తదితరులు పూజలు చేపట్టారు. పూజలు అనంతరం సిరిమానును మాకివలస గ్రామంలోకి తీసుకొని వచ్చారు.