కాల్పులు.. ఉగ్ర చర్యే: ట్రంప్
అమెరికా వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పులు ఉగ్రచర్యేనని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఈ కాల్పులకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనను విద్వేషపూరిత ఉగ్రదాడిగా పేర్కొన్న ట్రంప్.. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన వారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.