VIDEO: తాటిపూడి నీరు విడుదలకు సన్నాహాలు

VZM: గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 295.5 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి 485 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో అధికారులు నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.