తుళ్ళూరులో బాల్య వివాహాల పై అవగాహన

తుళ్ళూరులో బాల్య వివాహాల పై అవగాహన

GNTR: పిల్లల భద్రత.. పెద్దల బాధ్యత పై తుళ్ళూరు (M) మండడం గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు స్థానిక ప్రజలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సంద్భంగా పలువురు మాట్లాడుతూ.. బాల్యం అమూల్యమైందని ఎవరూ చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ తదితరులు ఉన్నారు.