విధి నిర్వహణలో గుండెపోటుతో AR కానిస్టేబుల్‌ మృతి

విధి నిర్వహణలో గుండెపోటుతో AR కానిస్టేబుల్‌ మృతి

GNTR: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళగిరి మండలం కూరగల్లుకు చెందిన కట్టిపోగు శ్రీనివాసరావు సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడని నిర్ధారించారు.