'ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న కోదాడలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సేవ చేసే నాయకులను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు.