రోడ్డుకు మరమ్మతులు చేసిన యువకులు

KNR: రామడుగు మండలం వెలిచాల గ్రామం నుండి కొత్తపల్లికి వెళ్లే రహదారిపై గుంతలు పడి ఇబ్బందిగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిని గమనించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు అభిమానులు, ఆరేపల్లి వినోద్, ఆరేపల్లి ప్రశాంత్, గొల్లపల్లి మహిపాల్ తదితరులు కలిసి సిమెంట్, కంకరతో రహదారి మరమ్మతులు చేపట్టారు.