మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

NRML: ప్రియదర్శిని నగర్‌లో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.