బాధ్యతాయుత డ్రైవింగ్‌కు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఫిదా..!
CTR: రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే ఘటన చిత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నిత్యబాబు విధుల్లో ఉండగా హెల్మెట్ ధరించి వెళ్తున్న ఓ యువకుడు ఫోన్ కాల్ రావడంతో వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడిన తీరు గమనించారు. బాధ్యతాయుత డ్రైవింగ్ సమాజానికి ఆదర్శమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి భద్రతకు అవసరమని సూచించారు.