వాయు కాలుష్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ

వాయు కాలుష్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ

ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పివేస్తుంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు సాధారణంగానే కొనసాగుతున్నాయని, విమానాల సమయాల్లో మార్పులను తెలుసుకోవడానికి ప్రయాణికులు సంబంధిత సంస్థను సంప్రదించాలని సూచించింది.