'రేపు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం'

'రేపు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం'

NLG: శాలిగౌరారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని గురువారం ఉదయం మండల కేంద్రంలో GBM ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి ఇవాళ తెలిపారు. ఈ సమావేశానికి MLA మందుల సామేలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 14న మాలిపురంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.