VIDEO: రేపు మురుమళ్ళ ఆలయం మూసివేత
కోనసీమ: చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీన మురమళ్ల వీరేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు నిర్వహించే నిత్య కళ్యాణాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసి స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తామని పేర్కొన్నారు. తిరిగి బుధవారం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, నిత్య కళ్యాణాలు కొనసాగుతాయని, భక్తులు గమనించాలని కోరారు.