100 ఇండస్ట్రియల్ పార్కులు, రైతులకు చేయూత
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.2,584 కోట్లు కేటాయించింది. దీనివల్ల 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అలాగే, 100 ఇండస్ట్రియల్ పార్కుల కోసం 'భావ్య' పథకానికి రూ.33,660 కోట్లు, పత్తి రైతులకు MSP కింద రూ.1,718 కోట్లు మంజూరు చేసింది.