చదువుల పండుగ కార్యక్రమాన్ని కొనసాగించాలి: కలెక్టర్
NRPT: జిల్లాలో చదువుల పండగ కార్యక్రమం కొనసాగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ ఛాంబర్‌లో విద్యాశాఖపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. SSC చదువుతున్న విద్యార్థుల మార్కులు తల్లిదండ్రులకు తెలిసేలా చేయడానికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.