ఈ నెల 31న కరీంనగర్ బల్దియా బడ్జెట్

ఈ నెల 31న కరీంనగర్ బల్దియా బడ్జెట్

కరీంనగర్ నగర పాలక సంస్థ ఈ నెల 31 ప్రత్యేక బడ్జెట్  సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు పాలక వర్గ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు కార్యాలయం సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. అంచనా బడ్జెట్ రూ. 312.46 కోట్లుగా నిర్ణయించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలను కార్పొరేటర్లకు అందజేశారు.