పత్తి కొనుగోలు చేయడం లేదంటూ రైతు ఆవేదన

పత్తి కొనుగోలు చేయడం లేదంటూ రైతు ఆవేదన

ఖమ్మం రూరల్ గుర్రాలపాడులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా పత్తి కొంతమేర రంగు మారడంతో దానిని సాకుగా చూపించి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అసలే వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ఇలా కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏంటని వాపోయాడు.