అసంఘటిత కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు

అసంఘటిత కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు

GNTR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అసంఘటిత కార్మికులకు గుంటూరులో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. కార్మికులు శ్రమ కార్డును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్డు ద్వారా వైద్య సహాయం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.