మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

RR: స్వాతంత్య్రం రాకముందే సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజలకు విద్యను నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు.