VIDEO: రోడ్డు ప్రమాదం.. 22 మందికి గాయాలు
ప్రకాశం: రెంటచింతల హైవే పరిధిలోని హోసన్న మందిరం వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం (D) దోర్నాల నుంచి మొక్కజొన్న కోతకు 25 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలు కాగా.. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.