బైక్‌ను ఢీకొన్న బస్సు

బైక్‌ను ఢీకొన్న బస్సు

KDP: వల్లూరు మండలం గోటూరు సమీపంలో ఈద్గా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖాజీపేట మండలం అప్పనపల్లికి చెందిన చౌడయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కడప నుంచి ప్రొద్దుటూరు పోతున్న బస్సు ఎర్రగుంట్ల వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో చౌడయ్యకు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి చికిత్సకు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.