రాహుల్ గాంధీని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు
NZB: ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీల నియామకాల వివరాలను రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్ వివరించారు.