మర్కాపురం ఘటన.. మృతుడికి తుది వీడ్కోలు!

మర్కాపురం ఘటన.. మృతుడికి తుది వీడ్కోలు!

NLR: మర్కాపురం టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోకంచి గ్రామానికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో DNA పరీక్షల అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన తోకంచికి తరలించారు.  మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక మాకు దిక్కెవరంటూ ఇద్దరు కుమార్తెల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది.