'మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

ATP: ​ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ క్యాప్టెన్ పి.సత్యప్రసాద్ శుక్రవారం అనంతపురంలో పర్యటించారు. మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు రామావత్ పార్వతి, దరపనేని శ్రావణిలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. వీరమరణం పొందిన జవాన్ నరేష్ సాకే కుటుంబాన్ని పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, భూమి కేటాయింపుపై హామీ ఇచ్చారు.