నేడు ఖాజీపేట మండల సర్వసభ్య సమావేశం..!
KDP: ఖాజీపేటలోని MPDO కార్యాలయ సభా భవనంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO దివిజాసంపతి బుధవారం తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి అధికారులు ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు తప్పక హాజరు కావాలన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సమావేశ కార్యక్రమంలో వివరించాల్సి ఉంటుందని అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.