రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NZB: బోధన్ సబ్ స్టేషన్ పరిధిలోని పట్టణంలో మరమ్మత్తు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ నాయిని కృష్ణ శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 33/11 కేవీ సబ్ స్టేషన్లో పనులు జరుగుతాయని, ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.