హసన్‌పర్తిలో త్వరలో డీసీసీబీ నూతన శాఖ
WGL: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) తన సేవలను మరింత విస్తరిస్తోంది. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఏసీఎస్ భవనంలో నూతన శాఖను ప్రారంభించేందుకు బ్యాంక్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ శాఖ అందుబాటులోకి రావడం ద్వారా హసన్‌పర్తి మండలం సహా సమీప గ్రామాల ప్రజలకు, రైతులకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువకానున్నాయి.