అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
TG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతితో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగిందని.. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని పేర్కొన్నారు.