'మణిపూర్‌లో ఇంకా ఆంక్షలేనా?'.. NHRC సీరియస్

'మణిపూర్‌లో ఇంకా ఆంక్షలేనా?'.. NHRC సీరియస్

మణిపూర్‌లో జనం ఇంకా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారా? ఇంఫాల్-దిమాపూర్ హైవే (NH-2) దిగ్బంధంపై NHRC సీరియస్ అయ్యింది. కాంగ్‌పోక్పిలో దోపిడీల వల్ల జనం భయంతో రోడ్డు ఎక్కాలంటేనే జంకుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై జనవరి 4లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కాంగ్‌పోక్పి జిల్లా అధికారులను NHRC ఆదేశించింది. ఇది హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.