ఖమ్మంలో విద్యుత్ శాఖ.. పట్టణ బాట కార్యక్రమం
ఖమ్మం 46వ డివిజన్లో బుధవారం విద్యుత్ శాఖ పట్టణ బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు పనులకు DE రామారావు, ఏడీఈ నాగార్జున శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ తీగల మార్పు, నూతన స్తంభాల ఏర్పాటు వంటి పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి విద్యుత్ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.