అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం

ATP: అనంతపురంలోని బళ్లారి బైపాస్ వద్ద ఓ ఆటోమొబైల్ షాప్‌లో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.10 లక్షల ఆటోమొబైల్ సామగ్రి మంటల్లో కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపుచేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.