మట్టి మిద్దె యజమానులకు నోటీసులు
NDL: చాగలమర్రిలోని 10 మట్టిమిద్దెల యజమానులకు విఆర్‌వో బాలయ్య నోటీసులు అందిచారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని వార్డులలో పర్యటించి మట్టి మిద్దెలలో నివాసం ఉంటున్న వారికి మొంథా తుఫాన్ గురించి వివరించామన్నారు. పాడుబడిన భవనాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారని వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.