సమస్యగా మున్సిపాలిటీ మురుగు నీరు

పార్వతీపురం: పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు పలు వార్డుల్లో, కాలువల్లో ఉండే మురుగు నీరు రోడ్లపైన ప్రవహిస్తుండడంతో స్థానికులు మున్సిపల్ ప్రజారోగ్య అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తొలి రోజుల్లోనే పట్టణంలో కాలవల్లో పూడికలు తొలగించారు. ఆ తర్వాత 3 ఏళ్లయన, ప్రధాన రహదారికి 30 వార్డుల్లో ఉన్న కాలువల్లో పూడికలను తొలగించలేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.