పండగ శాంతియుతంగా నిర్వహించుకోవాలి: సీఐ

TPT: రేణిగుంట రూరల్ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లికేశం గ్రామాన్ని సీఐ మంజునాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి శనివారం సందర్శించారు. గ్రామ పెద్దలు, వినాయక కమిటీ సభ్యులతో సమావేశమైన సీఐ మంజునాథ్ రెడ్డి వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సజావుగా సాగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.