4న జిల్లాలో 144 సెక్షన్: ఎస్పీ

SRD: నీట్ పరీక్ష సందర్భంగా జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 4వ తేదీన 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. నీట్ పరీక్ష కంది మండలంలోని ఐఐటీ, ఓడిఎఫ్‌లోని కేంద్రీయ విద్యాలయం, సంగారెడ్డిలోని బాలుర జూనియర్ కళాశాల, చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతుందన్నారు.