VIDEO: కొత్త పోస్టల్ బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి
కృష్ణా: మచిలీపట్నంలో కొత్త పోస్టల్ బ్రాంచ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాంకింగ్, కార్గో, బీమా సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. దేశ, విదేశాలకు పార్సిల్ రవాణా సౌకర్యం ఉండటంతో వ్యాపారులకు తక్కువ ఖర్చుతో సరుకు పంపించే అవకాశం కలుగుతుందన్నారు.