రానున్న వారం రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

రానున్న వారం రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

NZB: ఉమ్మడి జిల్లాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుంది. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 42°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ వేడికి తోడు వేడి గాలులు వీచే అవకాశం ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. రైతులు, కూలీలు ఎండలో పనులు చేసేటప్పుడు తలపాగా వాడటం, నీరు ఎక్కువగా తాగడం మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.