స్థల వివాదం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

స్థల వివాదం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

KRNL: ఆదోని పట్టణంలో స్థల వివాదంలో ఓ మహిళను కులం పేరుతో అవమానించిన ఘటనపై ఆదోని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దుర్గా రైస్ మిల్ సమీపంలోని 7.50 సెంట్ల స్థలానికి కాంపౌండ్ వాల్ను మహమ్మద్, ఎస్ఎండీ ఇసాక్, మరికొందరు ప్రొక్లెన్తో కూల్చివేశారు. అడ్డుకోబోయిన మహిళను కులం పేరుతో దూషించారు.