వరద బాధిత కుటుంబాలకు పరిహారం
TPT: KVB పురం మండలంలోని రాయల చెరువుకు గండిపడి మూడు గ్రామాలు వరద నీటికి గురయ్యాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3,000 ఆర్థిక సాయంతో పాటు బియ్యం 25 కిలోలు, పప్పులు, కూరగాయలు, నూనె, చక్కెర వంటి సరుకులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పశు నష్టం వాటిల్లిన రైతులకు ఆవు, గేదెకు 50,000, మేకకు 7,500 పరిహారం అందిస్తామన్నారు.