VIDEO: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
GNTR: పెదనందిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాసిం పీరా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.