కానిస్టేబుల్ హనుమంతరావు గుండెపోటుతో మృతి
MLG: కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ హనుమంతరావు (42) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం కుమార్తె అన్నప్రాసన కోసం ద్వారకా తిరుమలకు కుటుంబంతో వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. రాత్రి సత్తుపల్లిలో రోడ్డు పక్కన ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.