ఓటమి గెలుపుకు పాఠం కావాలి: CP సజ్జనార్
HYD: ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై HYD సీపీ సజ్జనార్ స్పందించారు. ఓటమి గెలుపుకు పాఠం కావాలి కానీ, జీవితానికి ముగింపు కాకూడదన్నారు. ఆత్మహత్యల వార్తలు చదువుతుంటే గుండె భారం అవుతోందని, తీవ్రమైన బాధ కలుగుతోందని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న చిన్న భయం, ఆ క్షణపు నిరాశతో 8 మంది విద్యార్థులు తమ నిండు ప్రాణాలను తీసుకోవడం విషాదకరమన్నారు.