యూరియా కొరతతో రైతుల అవస్థలు

GDWL: ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను అందించలేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సెంటర్‌లో యూరియా కోసం రైతులు, మహిళలు అర్ధరాత్రి నుంచే భారీ క్యూలలో నిలబడ్డారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం టోకెన్లు అందిస్తున్నప్పటికీ, క్యూలో నిలబడిన వారికి యూరియా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.