ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

VKB: బొంరాస్పేట మండలం లింగన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ప్రధానోపాధ్యాయుడు శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యా యులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు రాఖీలు కట్టుకొని 'నీకు నేను రక్షా-నువ్వు నాకు రక్ష' అనే నినాదంతో సంబరంగా కార్యక్రమం ముగించారు.