కాంట్రాక్ట్ బస్సులపై తనిఖీలు.. 122 కేసులు నమోదు
TPT: జిల్లాలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 1100 బస్సులను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన 122 బస్సులపై కేసులు నమోదు చేశారు. 6 వాహనాలను స్వాధీనం చేసుకుని రూ.16 లక్షల జరిమానా వసూలు చేశారు. రోడ్డు భద్రత కోసం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.