కార్తీక తొలి సోమవారం.. శివాలయాల్లో భక్తుల కోలాహలం

కార్తీక తొలి సోమవారం.. శివాలయాల్లో భక్తుల కోలాహలం

VSP: కార్తీక మాసంలో తొలి సోమవారాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు శివలింగానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి, దీపాలను వెలిగించి శివనామస్మరణ చేశారు.