జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. UPDATE
మర్కాపురం జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు గురైన బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ప్రయాణికుల్లో 12 మంది బయటపడగా, 28 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సులో కనిగిరి, పామూరు వాసులు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.