'ఎంపీవో, డీపీవోలపై కేసులు నమోదు చేయాలి'
JGL: జిల్లా బుగ్గారం ఎంపీవో షేక్ అఫ్జల్ మియా, పూర్వ డీపీవో చీకోటి మదన్ మోహన్‌లపై కేసులు నమోదు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి రెండు ఫిర్యాదులు బుగ్గారం ఎస్సై జీ. సతీష్‌కు సమర్పించారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త 2024 Dec 6న క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇచ్చిన ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు అమలు కాలేదని ఆరోపించారు.