VIDEO: ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
WNP: జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి అధికారం ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.