జుంబారే.. బరువు తగ్గాలే!
జుంబా డ్యాన్స్‌తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది. శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజూగ్గా తయారవుతారు. శరీరం దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కండరాలు పటిష్టంగా తయారవుతాయి. ఈ డ్యాన్స్‌తో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గొచ్చు. మహిళలు థైరాయిడ్, పీసీఓడీ నుంచి బయటపడొచ్చు.