పెట్రోల్ బంకులో తనిఖీలు
KMR: రాజంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును జిల్లా సివిల్ సప్లై డీటీ తిరుపతి, సిబ్బంది మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇటీవల పెట్రోల్ బంకులో డీజిల్ కల్తీ అవుతుందని వాహనదారులు ఆరోపించిన నేపథ్యంలో అధికారులు పెట్రోల్ శాంపిల్స్ సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను అందించాలని డీటీ ఆదేశించారు.